Saturday, February 7, 2026
Homeరంగారెడ్డిMedchal | ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకుల దాడి

Medchal | ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకుల దాడి

  • మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్

అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్ లో కాంగ్రెస్ గుండాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై, ఉద్యమ కారులపై చేసిన దాడిని మేడ్చల్ మున్సిపల్ 4వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో శాంతి భద్రతలు మంటలో కలిసిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రమించిన, ఉద్యమకారులపై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీ షీటర్లను పెట్టీ దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గుండాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, మూడు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని గణేష్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓడిపోతుందని అక్కసుతోటే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News