కరీంనగర్: బీసీ రిజర్వేషన్ లు అమలు చేసి ఎన్నికలకు వెళ్తామని ప్రగల్భాలు పలికి న కాంగ్రెస్ సర్కార్, చివరికి బీసీలను నమ్మించి నట్టేట ముంచిందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్.ఆరోపించారు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో బీసీ సంఘాల నాయకులు కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీలని నమ్మించి మోసం చేసిందని ఆ పార్టీకి రాబోవు రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో రవీంద్ర చారి,ఉమ మహేశ్వర్,నారాల శ్రీకాంత్,దిలీప్,కిశోర్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

