Tuesday, March 24, 2026
Homeరంగారెడ్డిPeddamangalaram | పెద్దామంగళారం 18వ వార్డు అభివృద్ధే ధ్యేయం

Peddamangalaram | పెద్దామంగళారం 18వ వార్డు అభివృద్ధే ధ్యేయం

  • కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చేవూరి అరుణ రామకృష్ణగౌడ్

మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దామంగళారం 18వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చేవూరి అరుణ రామకృష్ణగౌడ్ తెలిపారు. శుక్రవారం ఆమె భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల మౌలిక అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి, ప్రతి వీధికి సరిపడా లైట్లు ఏర్పాటు వంటి అంశాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. మహిళలు, యువత, వృద్ధుల సంక్షేమమే తన పాలనలో ప్రధాన అజెండాగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి సమస్యను అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంటనే పరిష్కరించేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా సేవలందిస్తానని, వార్డు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇస్తే, పెద్దామంగళారం 18వ వార్డును పరిశుభ్రత, సౌకర్యాలు, అభివృద్ధిలో ముందున్న ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అరుణ రామకృష్ణగౌడ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News