Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణComplaint |ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Complaint |ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

  • అసెంబ్లీ ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్లో వెల్లడికాని స్థిరాస్తులపై ఫిర్యాదు
  • అఫిడవిట్లో 30 ఎకరాలలోపు, కానీ భూభారతి రికార్డులో దాదాపు 250 ఎకరాల భూమి
  • తప్పుడు సమాచారంతో ప్రజలను, ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించిన ఎమ్మెల్యే
  • సమగ్ర దర్యాప్తు చేపట్టి, దోషిగా తేలితే ఎమ్మెల్యే అర్హత రద్దు చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చట్ట ఉల్లంఘన జరిగినట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్స్ (ట్రెసా) అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2023లో జరిగిన అలేర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (తండ్రి సోమరాజు) తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్లో తనకు చెందిన అసలు స్థిరాస్తులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే అయిలయ్య సమర్పించిన అఫిడవిట్లో తనకు కేవలం 30 ఎకరాలలోపే భూమి ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను, ఎన్నికల అధికారులను మరియు ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని శ్రీనివాస్ రావు ఆరోపించారు.

ఆయన సంతకం చేసి ప్రమాణపూర్వకంగా సమర్పించిన అఫిడవిట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్స్ 33 మరియు 125ఏ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారని తెలిపారు. ట్రెసా అధ్యక్షుడు సమర్పించిన ఫిర్యాదులో, బీర్ల కుటుంబానికి చెందిన సుమారు 250 ఎకరాల భూములు మూడు గ్రామాల్లో విస్తరించి ఉన్నాయని, ఆ వివరాలు భూభారతి రికార్డుల్లో స్పష్టంగా లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రికార్డులతో పాటు భూస్వామ్య పత్రాలు, మ్యాపులు, రికార్డు కాపీలు కూడా ఆయన ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుకు జతచేశారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దోషిగా తేలితే ఎమ్మెల్యే అర్హత రద్దు చేయాలని శ్రీనివాస్ రావు ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.

YouTube player

“ప్రజాస్వామ్యంలో ఎన్నికల పారదర్శకత అత్యంత ముఖ్యమైనది. ప్రతి అభ్యర్థి ప్రజల ముందుంచే అఫిడవిట్ నిజమైన వివరాలతో ఉండాలి. చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిని క్షమించరాదు,” అని ట్రెసా అధ్యక్షుడు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులకు ఫిర్యాదుతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్లకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎన్నికల నామినేషన్లో తప్పుడు సమాచారంతో సమర్పించిన అఫిడవిట్పై ఫిర్యాదు చేసినట్లు ట్రెసా అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News