- కొండపాక పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
- వైద్యసిబ్బందిని అభినందించిన కలెక్టర్
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం రోజున కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిశీలన సందర్భంగా కలెక్టర్ ఓపీ రిజిస్టర్, అటెండెన్స్ రికార్డులు పరిశీలించి, ఈరోజు 50 మందికి పైగా రోగులను సేవలందించిన మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బందిని అభినందించారు. తదుపరి, కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు మొదటి వైద్య సహాయక స్థలం.

అన్ని పరికరాలు, మందులు సక్రమంగా అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన సేవలు అందించాలి,” అని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ పీహెచ్‌సీలో కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నట్లు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ, రిపేర్ అవసరాలన్నీ వెరిఫై చేసి, ఇంజనీరింగ్ అధికారులతో వెంటనే అంచనా సిద్ధం చేయండి,” అని సూచించారు. అనంతరం కలెక్టర్ పి హెచ్ సి ప్రాంగణంలోని ఆయుష్ కేంద్రం సేవలను కూడా సమీక్షించి, రోగులకు అందిస్తున్న చికిత్సా విధానాల గురించి ఆరా తీశారు. గ్రామ ప్రజలు కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ హైమావతి పరిశీలనతో వైద్యసేవల్లో మరింత నాణ్యత వస్తుందనే నమ్మకం ఉంది,” అని అన్నారు.
