Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణసిఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు వరం

సిఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు వరం

భారతదేశంలో సిఎంఆర్‌ఎఫ్‌(CMRF) పథకం ద్వారా పేదల ఆరోగ్యానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ది దారులకు తొమ్మిది మంది కి 4 లక్షల 30 వేల రూపాయల సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పటేల్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడతూ భారతదేశంలో సిఎంఆర్‌ఎఫ్‌ పధకం ద్వారా పేదల ఆరోగ్యానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గత సంవత్సరం కాలంలో రూ. 700 కోట్ల పధకం ద్వారా పేదలకు సహాయం చేశారని అన్నారు. సిఎంఆర్‌ఎఫ్‌ పధకం పేదలకు వరమని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్స కోసం తమను సంప్రదిస్తే ఈ పథకం ద్వారా సహాయం చేస్తామని అన్నారు. సిఎంఆర్‌ఎఫ్‌ పధకం ద్వారా నిధుల విడుదలకు సహకరించిన జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, నల్గొండ ఎంపి రఘువీర రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు.లబ్ది దారుల వివరాలు , సూర్యాపేట పట్టణంలోని హనుమాన్‌ నగర్‌ కు చెందిన మేకల లక్ష్మి, నిమ్మికల్‌ గ్రామానికి చెందిన వీరబోయిన మహేష్‌,కూరెళ్లి భార్గవ చారి, దుబ్బతండా కు చెందిన జాటోతు భానుచందర్‌, సూర్యాపేట పట్టణం 37 వ వార్డు కు చెందిన గుణగంటి రాములమ్మ, భక్తాల పురం కు చెందిన ఎరుగు వీరయ్య, సూర్యాపేట శ్రీ రామ్‌ నగర్‌ కు చెందిన షేక్‌ బాబా, టేకుమట్ల గ్రామానికి చెందిన మేడి జయమ్మ, గుంజలూరు గ్రామానికి చెందిన వడ్డె ఉదయ్‌ కిరణ్‌ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమం లో డాక్టర్‌ రామ్మూర్తి, షఫీ ఉల్లా, కర్ణాకర్‌, ప్రవీణ్‌, స్వామి పార్టీ కార్యకర్తలు తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News