హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (Hazrat Khwaja Moinuddin Chishti) 814వ ఉర్సు(Ursu)ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గా(Ajmer Sharif Dargah)కు చాదర్(Chadar)ను సమర్పించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, ప్రేమ, సోదర భావానికి చిహ్నంగా నిలుస్తోంది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం(Secretariat)లో అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ ఖాద్రీ పాషా బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు ఇతర ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
