Monday, October 6, 2025
ePaper
Homeతెలంగాణరూ.1200 కోట్ల పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్

రూ.1200 కోట్ల పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్

రేపు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి రేపు (జూన్ 6న శుక్రవారం) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 1200 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో.. గంధమల్ల ప్రాజెక్ట్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, బ్రిడ్జిలు, రహదారుల పనులకు శంకుస్థాపన తదితర కార్యక్రమాలు ఉన్నాయి. శంకుస్థాపనల అనంతరం తురకపల్లి మండలంలోని తిరుమలపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రేవంత్‌తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొంటారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News