Tuesday, March 3, 2026
Homeఖమ్మంCM Revanth | ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Revanth | ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఖమ్మం జిల్లా(Khammam District) ఏదులాపురంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పాలేరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల(Paleru Government Nursing College) విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. జపాన్(Japan), జర్మనీ(Germany), దక్షిణ కొరియా(South Korea) వంటి విదేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు ఉన్న అవకాశాలను ప్రస్తావించారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం భాషా శిక్షణ (Language Training) అందిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ‘ప్రజా పాలన–ప్రగతి బాట'(Praja Paalana-Pragati Baata) కార్యక్రమంలో భాగంగా సీఎం పాలేరు నర్సింగ్ కళాశాలతోపాటు కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో కొత్త మార్కెట్ యార్డును ప్రారంభించారు. మున్నేరు-పాలేరు అనుసంధాన కాలువ, జేఎన్టీయూ కళాశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News