Tuesday, February 10, 2026
HomeతెలంగాణRevanth Reddy | స్థానాలు 90% ..!

Revanth Reddy | స్థానాలు 90% ..!

  • గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు
  • స్థానికంగా గెలిచే వారికే పార్టీ అండ
  • ప్రతి డివిజన్, వార్డూ గెలుపు ముఖ్యం
  • అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దు
  • రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి
  • ఇప్పుడే మేయర్, చైర్మన్ల ఎంపిక వద్దు
  • అందరం కలిసి అభ్యర్థులను ఎంపిక చేద్దాం
  • కాంగ్రెస్ నేతలకు సూచించిన సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

నామినేషన్ల పక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దు. భాజపా, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలి. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి’ అని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్రెడ్డి సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ నిర్దేశించారు.

- Advertisement -

రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీకి మినహాయింపునిచ్చారు. మొత్తం 2,996 వార్డులకు పోటీ జరగనుంది. ఈనెల 28 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పక్రియ శుక్రవారంతో ముగిసింది. శనివారం నాడు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది.

ఆ రోజు ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న హైదరాబాద్కు రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపై ఫిబ్రవరి 3 నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం.. పలు జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News