- ప్రిజన్ డ్యూటీ మీట్లోలో వివిధ పోటీల్లో పతకాలు సాధించిన విజేతలకు సీఎం అభినందనలు
- 28 పతకాలు కైవసం చేసుకున్న తెలంగాణ క్రీడాకారులు..
- కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ ప్రధానకార్యదర్శి రవిగుప్తా, అధికారులు
7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్లో వివిధ పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీలలో 133 పతకాల్లో 28 సాధించారు. ఇందులో 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యంపతకాలను తెలంగాణ కైవసం చేసుకున్నది. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివ కుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ మీట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.
- Advertisement -
