Sunday, April 12, 2026
HomeతెలంగాణRevanth Reddy | స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నాం

Revanth Reddy | స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నాం

అన్ని శాఖలకు సంబంధించి ఒకే పాలసీని తీసుకున్నాం : సీఎం రేవంత్

  • తెలంగాణకు స్పష్టమైన విజన్ తెలంగాణ రైజింగ్
  • క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు
  • ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వండి
  • అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకుండా చూడండి
  • వివిధ శాఖల మధ్య సమన్వయంపై అధికారులకు సీఎం రేవంత్‌ కీలక సూచనలు

ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, హెల్త్‌ లాంటి వివిధ శాఖలకు సంబం ధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. అందుకే ముఖ్యమైన విభాగా లకు ఒక పాలసీని తీసుకున్నాం. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్‌ `2047 విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశామన్నారు.రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

- Advertisement -

ఆయా శాఖల్లో పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు. ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా సీఎస్‌కు అందించా లని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హోచ్‌వోడీలు వెరిఫై చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పక్రియను జనవరి 26వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుం దని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీలోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ’

- Advertisement -
RELATED ARTICLES

Latest News