Wednesday, February 11, 2026
HomeతెలంగాణCM Revanth | పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్

CM Revanth | పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ హైదరాబాద్ గోషామహల్‌(Gosha Mahal)లోని పోలీస్ అమరుల స్మారకం వద్ద నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌(Police Flag Day Parade)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమర వీరులను స్మరించి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట డిజిపి శివధర్ రెడ్డి, పోలీస్అధికారులు, సిబ్బంది ఉన్నారు.

వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ (Friendly Policing) అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించేవారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News