పద్మ భూషణ్(Padma Bhushan), పద్మశ్రీ(Padmashri) పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైనవారికి సీఎం రేవంత్(CM Revanth) అభినందనలు(Congratulations) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశు సంవర్థక రంగంలో మామిడి రామారెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశిశేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. సేవ, కళా, ఇతర రంగాల్లో వారు చూపిన అంకితభావం, సేవలతోనే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
