Saturday, October 4, 2025
ePaper
HomeUncategorizedCM | 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM | ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ చేశారు. ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థికసాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా 2025-26 సంవత్సరానికి 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర ఖాతాల్లో జమ చేశారు. వీరిలో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News