Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంజమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటన

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ దుర్ఘటన

12 మందికి పైగా మృతి

జమ్మూ కాశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్‌ మాతా యాత్ర ప్రారంభ స్థలమైన ఈ ప్రాంతం నుంచి హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ విపత్తు తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పౌర, పోలీసు, సైన్యం, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి, ఉధంపూర్‌ ఎంపీ జితేంద్ర సింగ్‌ కూడా స్పందించారు. విపత్తు విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. హెలికాప్టర్‌ ద్వారా అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డిప్యూటీ కమిషనర్‌ పంకజ్‌ శర్మ ప్రకారం, చాషోటి ప్రాంతంలో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అధికారులు, రక్షణ బృందాలు ప్రమాద స్థలంలో శోధన, సహాయక పనులు కొనసాగిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News