- ప్రమాణ స్వీకారం రోజునే కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మధ్య బాహా బాహి
- ఎస్సై కృష్ణారెడ్డి రాకతో సర్దు మునిగిన ఘర్షణ
మేం .. ఇంతే మా తీరే ఇంతా మేం చెప్పిందే వేదం. మేం చేసిందే కరెక్ట్ ఉంటే ఉండండి లేకుంటే పోండి అన్న విధంగా వ్యవహరించారు బి ఆర్ ఎస్ నాయకులు.అందుకు జగదేవపూర్ మండలం కేంద్రం లోసోమవారం రోజున జరిగిన నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం లో జరిగిన సంఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే జగదేవపూర్ సర్పంచుల ఎన్నికల్లో భాగంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపి మూడు పార్టీలు పోటీ చేయగా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 8, మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు , బిజెపి అభ్యర్థి 1 స్థానాలు గెలుపొందగా సర్పంచ్ అభ్యర్థి బి ఆర్ఎస్, ఉప సర్పంచ్ అభ్యర్థి బిఆర్ఎస్ వారే కావడంతో వారికి సంబంధించిన వారికి కుర్చీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని.

మిగతా అభ్యర్థులు కాంగ్రెస్ బిజెపి వార్డు సభ్యులు కావడంతో వారికి కుర్చీలను ఏర్పాటు చేయలేదు దీనిపై ఆగ్రహంతో వారందరూ కలిసి సర్పంచ్ని కేవలం బిఆర్ఎస్ వల్లే వార్డు సభ్యుల మేము కాద అని ప్రశ్నించారు దీంతో కుర్చీలు ఏర్పాటు చేసేంతవరకు ఓ పక్కకు ఉండండి అంటూ నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్, బిజెపి బి ఆర్ ఎస్ ల మధ్య దారి తీసింది. అంతటితో ఆగకుండా ప్రమాణ స్వీకారం కార్క్రమంలో బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎస్సై కృష్ణారెడ్డి రాకతో ఘర్షణ కాస్త సర్దుబాటు చేయడంతో ప్రమాణ స్వీకారం పోలీసులు, అధికారుల మధ్య నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం సాఫీగా జరిగింది. ప్రమాణ స్వీకారం రోజునే పార్టీల మధ్య విభేదాలు సృష్టిస్తే రాబోయే రోజుల్లో ఇంకెన్ని విభేదాలు తీసుకొస్తారో నని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

