- సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నల్లచట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రైతు వ్యతిరేక లేబర్ కోడ్‌లను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక ఉద్యమ శక్తులు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు నగేష్ పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్‌లో నగేష్ ఆధ్వర్యంలో శనివారం కార్మిక, ప్రజాసంఘాల సమక్షంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం కార్మిక వర్గాన్ని పొట్టకొట్టడమేనన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇప్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, సదానందం, శివబాబు, వెంకటాద్రి, మల్లేష్, పాషామియా, సావిత్రి, విజయ, వనబాక్షి, సునీత తదితరులు పాల్గొన్నారు.
