Wednesday, March 4, 2026
Homeకరీంనగర్Rescue | ఆత్మహ*త్యకు యత్నించిన మహిళకు జీవం పోసిన సీఐ

Rescue | ఆత్మహ*త్యకు యత్నించిన మహిళకు జీవం పోసిన సీఐ

  • కాలేజీ విద్యార్థుల సమాచారం… సీఐ సాహసం… ఆసుపత్రికి తరలింపు

మానవత్వానికి నిదర్శనం నిలుస్తూ,గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి(indrasena reddy) పెట్రోల్ పోసుకుని ఆత్మహ*త్యాయత్నానికి(suic*de attempt) పాల్పడిన ఒక మహిళను తక్షణమే ఆదుకొని ఆసుపత్రికి తరలించారు(rescued).ఈ సంఘటన గోదావరిఖనిలో(godavarikhani) సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం రాత్రి,గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న చెట్ల పొదలలో ఒక మహిళ శరీరానికి నిప్పంటించుకుని అరుస్తున్నట్లు మెడికల్ కాలేజీ విద్యార్థులు సిఐ ఇంద్రసేన రెడ్డి కి సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అక్కడ సగం కాలిన శరీరంతో,ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు.సీఐ స్వయంగా సిబ్బంది,మెడికల్ కళాశాల విద్యార్థుల సహాయంతో ఆ మహిళను హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది.పోలీస్ అధికారి తక్షణ స్పందన,మానవత్వంతో కూడిన ఈ సాహసంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆ మహిళ ఆత్మహ*త్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News