Tuesday, March 3, 2026
Homeనల్లగొండNominations | సర్పంచి 150.. వార్డులకు 595 నామినేషన్లు .

Nominations | సర్పంచి 150.. వార్డులకు 595 నామినేషన్లు .

చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గానూ ఏర్పాటు చేసిన ఆరు క్లస్టర్లలో శనివారం చివరి రోజు కావడంతో సర్పంచ్ స్థానాలకు 150 నామినేషన్లు, వార్డు స్థానాలకు 595 అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు చిట్యాల ఎంపీడీవో అధికారి ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. ఏపూరు సర్పంచ్ 6 వార్డులకు 28, ఆరెగూడెం సర్పంచ్ 10 వార్డులకు 24, బొంగును చెరువు సర్పంచ్ మూడు వార్డులకు 15, బోయగుబ్బ సర్పంచ్ తొమ్మిది వార్డులకు 22, చిన్నకాపర్తి సర్పంచ్ 13 వార్డులకు 40, ఎలికట్టె సర్పంచ్ నాలుగు వార్డులకు 27, గుండ్రంపల్లి సర్పంచ్ 12 వార్డులకు 81, నేరడ సర్పంచ్ పది వార్డులకు 16, పెద్ద కాపర్తి సర్పంచ్ 14 వార్డులకు 44, పేరేపెల్లి సర్పంచ్ ఏడు వార్డులకు 23, పిట్టంపెల్లి సర్పంచ్ ఐదు వార్డులకు 21, సుంకనపల్లి సర్పంచ్ నాలుగు వార్డులకు 24, తాళ్ల వెల్లంల సర్పంచ్ 9 వార్డులకు 33, ఉరుమడ్ల సర్పంచ్ పది వార్డులకు 48,వనిపాకల సర్పంచ్ 12 వార్డులకు 25, వెలిమినేడు సర్పంచ్ 12 వార్డులకు 79, వెంబాయి సర్పంచ్ 5 వార్డులకు 17, వట్టిమర్తి సర్పంచ్ ఐదు వార్డులకు 28 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News