- చింతగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం
- సర్పంచ్ గా తీర్మానించిన మాడేమోని ఆగమయ్య
- 10 వార్డులు కూడా ఏకగ్రీవం
- గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంపై తీర్మానం
- ఏకగ్రీవంగా ఎన్నిక అవడంపై ఆదర్శంగా నిలుస్తున్న చింతగూడ గ్రామం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ రెండవ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ సర్పంచ్ ఎన్నిక పూర్తయింది.పోటీ లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవటం జరిగింది.గ్రామంలో సుమారుగా 908 మంది జనాభా,10 వార్డులు ఉన్నాయి. అయితే, ఈ గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని, అదే గ్రామానికి చెందిన మాడేమోని ఆగమయ్య ముందుకు వచ్చారు.
దీంతో పార్టీలతో సంబంధం లేకుండా పార్టీల కతీతంగా మాడేమోని ఆగమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్ద మనిషిగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను సర్పంచ్ గా ఎన్నుకునట్లు గ్రామ పెద్దలు, ప్రజలు పేర్కొన్నారు.సర్పంచ్ గా ఎన్నికైన మాడేమోని ఆగమయ్యను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు.పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని ఏకగ్రీవ సర్పంచ్ మాడేమోని ఆగమయ్య పేర్కొన్నారు.
పది వార్డులు ఏకగ్రీవం…
ఉప సర్పంచ్ గా వంగూరి శంకరయ్య..
గ్రామ సర్పంచ్ మాడెమోని ఆగమయ్యతో పాటు 10 వార్డులు కూడా ఏకగ్రీవంగా గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు. ఒకటో వార్డ్ మెంబర్ గా అనంతమ్మ, రెండో వార్డ్ మెంబర్లుగా స్వర్ణలత, మూడో వార్డ్ మెంబర్గా శ్రీశైలం, నాలుగో వార్డ్ మెంబర్గా పద్మమ్మ, ఐదవ వార్డ్ మెంబర్ గా నరేష్, ఆరవ వార్డు మెంబెర్ గా యాదగిరి, ఏడవ వార్డు మెంబర్గా ప్రభాకర్ రెడ్డి,ఎనిమిదవ వార్డ్ మెంబర్ గా శంకరయ్య,తొమ్మిదవ వార్డ్ మెంబర్ గా మమత, పదో వార్డ్ మెంబర్ గా సత్యం లను గ్రామ పెద్దల అందరి సమక్షంలో ఎన్ని కోవడం జరిగిందని వారు తెలిపారు.
