- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని నేను సమర్థిస్తున్నాను
- మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వెల్లడి
కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం, రాజీవ్ గాంధీ వంటి సమర్థులు లేకపోవడం వల్లే యుద్ధం వచ్చిందని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు.ఆయన మాట్లాడుతూ “యుద్ధం విషయం గుర్తొస్తే చనిపోయిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గుర్తొస్తారు. ఫిబ్రవరి, 1991 ఇరాన్, కువైట్ మధ్య అమెరికా ప్రోత్సాహంతో యుద్ధం జరిగింది.అప్పుడు రాజీవ్ గాంధీ ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లి, గార్బచేవ్తో యుద్ధ విరమణ విషయమై మాట్లాడారు.
అక్కడి నుంచి టెహ్రాన్ కు వెళ్లి, ప్రపంచ అందరి నేతలతోమాట్లాడి, తర్వాత ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తో కూడా మాట్లాడి, ఫిబ్రవరి 28, 1991న, యుద్ధ విరమణ చేయించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ.ఆ తర్వాత దుబాయ్ మీదుగా, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు. మేమందరం సాదరంగా గౌరవించడం జరిగింది.కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం, రాజీవ్ గాంధీ వంటి సమర్థులు లేకపోవడం వల్లే యుద్ధం వచ్చింది.ప్రధాని మోడీ లాగా, రాజీవ్ గాంధీ ఢిల్లీలో కూర్చోలేదు.
ధైర్యంగా ముందడుగు వేశారు. యుద్ధాన్ని ఆపారు.మోడీ బలహీనమై విదేశాంగ విధానాన్ని ప్రపంచం అంతా నువ్వు కుంటున్నారు.అమెరికాకు తొత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ మారలేదు. యుద్ధం ఆపగలిగే మొగోడు, మొనగాడు రాజీవ్ గాంధీ వంటి వారు ప్రపంచంలో ఎవరూ లేరు.ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని నేను సమర్థిస్తున్నాను.ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచడంలో ఎలాంటి లాజిక్ లేదు.
డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు.గ్యాస్ దొరకడం లేదు. రేట్లు పెరిగాయి. పెట్రోల్ బంకులు దగ్గర హైదరాబాద్ లో ఆటోలు భారీ క్యూలు కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 160 ఎంపీ స్థానాలు, దక్షిణ భారతదేశం అంతా కలిపి 200 సీట్లు లేకపోవడం చాలా దారుణం. బీహార్, ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒక్కరి చేతిలోకి పోతే, దేశం ఏమైపోతదో? భవిష్యత్తులో దేశంలో రెండు ముక్కలైనా నాకైతే ఆశ్చర్యం లేదు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలే కేంద్రానికి 70% పన్నులు కట్టుతోంది.అనాలోచిత ప్రతిపాదిత నియోజకవర్గ సీట్లు పెంపు ఆలోచన వెనక్కి తీసుకోవాలి. ఇదే సమయంలో మహిళల రిజర్వేషన్లు పెరుగుదలను స్వాగతిస్తున్నాను.నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టు కాదు.
ఆ జడ్జిమెంట్ ను ఖండిస్తున్నాను. వ్యతిరేకిస్తున్నాను. బైబిల్ పట్టుకున్న మాల – మాదిగలు, కమ్మ, రెడ్లు అవుతారా?? అంటరానితనం అంటే ఏమిటో ఢిల్లీ పెద్దలకు తెలీదు.2029 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, రాజ్యాంగ సవరణ చేసి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని మాటిస్తున్నాను. ఎఫ్స్టీన్ ఒక సెక్స్ బ్రోకర్. ప్రపంచంలో ఉన్న దేశాధినేతలకు రష్యా అమ్మాయిలను సప్లై చేస్తాడు.70, 80 ఏళ్లు వృద్ధులైన దేశాధినేతలు, పెట్టుబడిదారులకు, 30 ఏళ్ల రష్యా యువతులను సెక్స్ రాకెట్ లోకి దించుతాడు. సెక్స్ రాకెట్ ముఠా రహస్యాలు ఇరాన్ దేశంలో టెహ్రాన్ అనే ప్రాంతంలో ఉన్నదనే అనుమానంతో, బాంబుల దాడి ప్రారంభించారని ఆయన వాపోయారు.
