- మురుగు కాలువలో బ్యాలెట్ పత్రాలు
- వెంటనే రేపు పోలింగ్ నిర్వహించాలి – చిరుమర్తి
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11వతేదిన జరిగిన సర్పంచ్ పంచాయతీ ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని ఓటమి పాలైన అభ్యర్థి రుద్రారపు బిక్షపతి పేర్కొన్నారు. రిగ్గింగ్ చేసి అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారని ఓడిపోయిన అభ్యర్థి రుద్రారపు బిక్షపతి, ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో తనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని.. అతను ఓడిపోతాడని ముందే తెలుసుకొని ఈ రిగ్గింగ్ పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ రిగ్గింగ్ కు సంబంధిత ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా సహకరించారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు పోలింగ్ సవ్యంగానే జరిగినప్పటికీ ఒకటి నుంచి రెండు గంటల వరకు భోజన సమయంలో ఏజెంట్లు అందర్నీ బయటకు పంపించి బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసి తమకు పడ్డ కత్తెర గుర్తులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తీసివేసి గెలిచిన అభ్యర్థి రింగు గుర్తు పై ఓట్లు వేసి బ్యాలెట్ బాక్స్ లో వేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ పరిసరాలలో ఉన్న మురుగు కాలువలో కత్తెర గుర్తుకు పడ్డ ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టలుగా పడవేయడం తాము గుర్తించినట్లు తెలిపారు. మీ బ్యాలెట్ పేపర్లు సుమారు 300 పైగాఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

అప్రజాస్వామిక గెలుపుపై పోరాడుతాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
అధికారం చేతిలో ఉంది కదా అని అప్రజా స్వామికంగా గెలిచేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ నాయకులపై అందుకు సహకరించిన అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చే చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గ్రామంలో బీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థి అత్యంత ప్రజాదారణ పొంది గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్ని తాము గెలిచినట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటని తెలిపారు.
