Wednesday, February 11, 2026
Homeఅంతర్జాతీయంChina | వరుసగా 4వ ఏడాది తగ్గిన జనాభా

China | వరుసగా 4వ ఏడాది తగ్గిన జనాభా

చైనా జనాభా(China Population) వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గింది(Decrease). ఆ దేశ జనాభా 2025లో 1.404 బిలియన్లుగా నమోదైంది. 2024తో పోల్చితే ఇది 3 మిలియన్లు తక్కువ కావటం గమనార్హం. గతేడాది చైనాలో 7.92 మిలియన్ల మంది మాత్రమే పుట్టారు. ఇది 1.62 మిలియన్లు లేదా 17 శాతం తక్కువ. ఇంకా వెనక్కి వెళితే.. చైనాలో జనాభా తగ్గటం అనేది 2023 నాటికే ఏడేళ్లుగా కొనసాగుతోంది. 2025లో రికార్డ్ లెవల్‌(Record Level)లో అతి తక్కువ బర్త్ రేట్(Low Birth Rate)(5.63 శాతం) నమోదైంది. ప్రతి వెయ్యి మంది ప్రజలకు సుమారు 6 శాతం మంది మాత్రమే జన్మిస్తున్నారు. 2023 వరకు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉండేది. కానీ.. ఆ సంవత్సరం ఇండియా(India) నంబర్ వన్ అయింది. సంతానం ఒక్కరు మాత్రమే ఉండాలి అనే విధానాన్ని(One Child Policy) కొన్ని తరాలుగా అమలుచేసిన చైనా.. దానివల్ల జరిగిన నష్టాన్ని పదేళ్ల కిందటే గుర్తించింది. సంతానాన్ని ప్రోత్సహించటానికి పలు చర్యలు చేపట్టింది. కానీ అవి ఆశించినంతగా ఫలితాలను ఇవ్వట్లేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News