- గాంధీ హాస్పిటల్ పరిసరాల్లో అనాధల ఆవేదన
- ఇద్దరు నిరాశ్రయులకు చేయూత
- ఆసుపత్రి వద్ద పస్తులున్న అనాధలకు రక్షణ
- అభాగ్యులకు చేయూతనందించిన పోలీసుల సేవలకు ప్రజల అభినందనలు
సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో చిలకలగూడెం పోలీసులు నిర్వహించిన తనిఖీ సందర్భంగా హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఆసుపత్రి లోపలి మరియు బయట ప్రాంతాలను పరిశీలిస్తుండగా ఇద్దరు అనాధ వ్యక్తులు తీవ్ర అస్వస్థతతో, భోజనం చేయక పస్తులుంటూ నీళ్లు లేక ఇబ్బందికర పరిస్థితుల్లో పడి ఉన్నట్లు గుర్తించారు.ఈ విషయాన్ని గమనించిన చిలకలగూడ పోలీసులు వెంటనే స్పందించారు.

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ గుప్తా సహకారంతో వెంటనే చర్యలు చేపట్టారు.వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అతనిని తక్షణమే గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.వైద్యులు అతనికి అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు.మరో వ్యక్తిని సురక్షితంగా సమీప ఆశ్రమంలో చేర్పించి భోజనం,నివాసం వంటి ప్రాథమిక అవసరాలు అందేలా ఏర్పాట్లు చేశారు.

ఈ చర్యలతో అభాగ్యులైనటువంటి ఇద్దరి అనాధల పట్ల చేయూతనందించి స్పందించిన చిలకలగూడ పోలీసు సిబ్బందికి గాంధీ హాస్పిటల్ రోగులు రోగుల సహాయకులు హర్షం వ్యక్తం చేశారు.పోలీసుల మానవతా దృక్పథం,స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జరిగిన ఈ చర్యను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.సమాజంలో నిరాశ్రయులు,అనాధలు కనిపించినప్పుడు వెంటనే సమాచారం అందించాలని చిలకలగూడ పోలీసులు ప్రజలను కోరారు.
