Friday, March 6, 2026
Homeసాహిత్యంChildren's Day | ఘనంగా బాలల దినోత్సవం

Children’s Day | ఘనంగా బాలల దినోత్సవం

రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డుల ప్రదానం

ప్రదానం చేసిన ప్రముఖ సంఘ సేవకులు, తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులను (Balamithra Awards) ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు, తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. బాలల మధ్య కేక్ కట్ చేసి ‘చిల్డ్రన్స్ డే’ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రచయిత, కవి అందెశ్రీకి (Andesri) మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

బాలమిత్ర అవార్డులను తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ తండ్రి శంకరయ్య జ్ఞాపకార్థం అందజేశారు. బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్‌తో వీటిని అందజేశారు. అవార్డులు పొందిన విద్యార్థులను విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమ నిర్వాహకుడైన వలస సుభాష్ చంద్రబోస్‌(Subhash Chandrabose)ను కూడా ప్రశంసించారు. చిన్నతనం నుంచే క్రీడల (Sports) పట్ల శ్రద్ధపెట్టాలని సూచించారు. చిన్నారులు విద్యలో రాణించి, మంచి మార్కులు సాధించి, సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారుకావాలని కోరారు. తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకొని నిరంతరం శ్రమించాలని, తద్వారా లక్ష్యాన్ని చేరేంత వరకు పట్టుదలతో చదవాలని ఉద్భోదించారు.

సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోలాటం బృందాలు చేసిన నృత్యాలు ప్రేక్షకులకు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విధ్వాంసులు గిటార్ రావు, సరస్వతి ఉపవాసకులు దైవజ్ఞ శర్మ(Daivagna Sharma), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది హేమవతి, తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి సంధ్య గౌడ్ పాల్గొన్నారు. వ్యాక్యాతగా మోహన్ గాంధీ వ్యవహరించారు. బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర నాయకులు సుశీల నాగపూర్ తిరుమల ఎద్దు మమత కేశ బోయిన రమా సుమలత సుశీల అనసూయ దాట్ల నిర్మల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News