Tuesday, April 7, 2026
Homeఆదిలాబాద్Basara | బాసర దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన

Basara | బాసర దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నిర్మల్ జిల్లాలోని బాసరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల వ్యయంతో అమలు చేయనున్న సమగ్ర అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా బాసరకు చేరుకోగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ & ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (జిల్లా ఇన్చార్జి మంత్రి), దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సమీపంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.

దేవాలయ సమీపంలో రూ.225 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి, అదనంగా రూ.200 కోట్లతో ముధోల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కూడా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరిస్తూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు నిర్మల్‌కు ప్రసిద్ధిగాంచిన కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్‌ను జ్ఞాపికలుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్, బైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్య, దత్తాత్రి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News