మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు చేన్నపురం వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. చేన్నపురంలో లక్షకు పైచిలుకు జనాభా కలిగినటువంటి అంబేద్కర్ నగర్ నుండి చెన్నపురం వరకు 50 కాలనీలు ఉన్నప్పటికీ వాటిని చేన్నపురం కేంద్రంగా డివిజన్ ను ఏర్పాటు చేయాలని కలెక్టరుకు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు జవహర్ నగర్ గ్రామపంచాయతీ ఏర్పడక ముందే తొలిగా అంబేద్కర్ నగర్ చేన్నపురం కాలనీలు ఉన్నాయని వాటిని విస్మరించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్.
హైదరాబాద్ లో 150 డివిజన్లను నూతనంగా ప్రవేశపెట్టడంతో చేన్నపురమును నిర్లక్ష్యంగా విస్మరించారని చేన్నపురం కాలనీలవాసులు కలెక్టరేట్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేన్నపురంను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనిచో మురికివాడల ప్రజలం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని డిమాండ్ చేస్తున్నారు.
గత 30 ఏళ్లుగా అత్యధికంగా వెనుకబాటుకు గురైందని అభివృద్ధికీ ఆమడ దూరంలో ఉందని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు చేన్నపురం అంబేద్కర్ నగర్ కాలనీవాసులు డంపింగ్ యార్డ్ దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి చేన్నపురంను డివిజన్ చేయాలని. మొరపెట్టుకుంటున్నారు. జింక నాగుల్ ముదిరాజ్. సిద్దులు యాదవ్. అనిల్ ముదిరాజ్ గూడెల్లి సురేష్ ముదిరాజ్. దంతూరి శివకుమార్ గౌడ్. జావిద్. తదితరులు పాల్గొన్నారు.
