- చేగూర్ సర్పంచ్ మంకాల శ్రీశైలం.
- అయ్యప్పస్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ.
నలభై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న అయ్యప్పలకు అన్న ప్రసాద వితరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చేగూర్ సర్పంచ్ మంకాల శ్రీశైలం పేర్కొన్నారు. నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో మంగళవారం సర్పంచ్ మంకాల శ్రీశైలం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నలభై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి దీక్ష చేయడమనేది చాలా క్లిష్టమైనదని అన్నారు.
ఆ అయ్యప్పపై భక్తితో,ధ్యానంతో ముందుకు వెళ్తేనే దీక్ష విజయవంతం అవుతుందన్నారు.స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషంగా ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అయ్యప్ప కమిటీ సభ్యులు అన్నదాత సర్పంచ్ ని ఘనంగా సన్మానించి, అభినందించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు హరిజీవన్, జంగయ్య గౌడ్, శేఖర్ గౌడ్, సి.కృష్ణ,బి.కృష్ణ, వడ్ల రమేష్,సుబ్బు,ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
