Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్ఆన్‌లైన్ పేమెంట్లపై ఛార్జీ

ఆన్‌లైన్ పేమెంట్లపై ఛార్జీ

కేంద్ర ప్రభుత్వ యోచన

ఆన్‌లైన్ చెల్లింపులపై ముఖ్యంగా యూపీఐ పేమెంట్లపై ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.3 వేల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలపై రుసుములు విధించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకులకు, పేమెంట్ గేట్‌వే సంస్థలకు సపోర్ట్ చేసేందుకు ఈ దిశగా పరిశీలన చేస్తోంది. మర్చెంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ను మళ్లీ ప్రవేశపెట్టాలని చూస్తోంది.

బిజినెస్‌ టర్నోవర్ కన్నా ట్రాన్సాక్షన్ వ్యాల్యూని బట్టి ఎండీఆర్‌కి అనుమతించేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ లావాదేవీల నిర్వహణకు తాము చేస్తున్న ఖర్చు పెరుగుతోందని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ కంపెనీలు ఆందోళన చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో సుమారు 80 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News