- పోలవరం ప్రాజెక్టుపై ఉన్న స్టాప్ – వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలి..
సాగునీటి ప్రాజెక్టులు, అంతర్ రాష్ట్ర వివాదాలపై చర్చ.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై అభ్యంతరాలు.. వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వండి.. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కు చంద్రబాబు వినతి.. కేంద్రానికి పలు అంశాలను వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు
పరిష్కారించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదికను వెంటనే గెజిట్లో ప్రచురించాలని, దీని ఆధారంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని ముఖ్యమంత్రి విన్నవించారు. గోదావరి జలాల పంపకంపై ఆంధప్రదేశ్-తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదంపై కూడా చర్చించారు. ఈ వివాదం పరిష్కారం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు సీఎం.
ఎగువ కృష్ణాపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు చేపట్టిన చర్యలపై సీఎం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ఆంధప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
- వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వండి
: సీఎం చంద్రబాబు వినతి
దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల అందించే ప్రోత్సాహకాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.216 కోట్లు ఇవ్వాలని కోరారు. 2024-25లో సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నామని.. ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగుకు మొగ్గు చూపుతూ సమ్మతి తెలిపారని చెప్పారు.
ఆంధప్రదేశ్లో కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ.200 కోట్ల మేర సాయం చేయాలని కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు అధునాతన పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని, అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతం ఉందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఏపీ హార్టికల్చర్ హబ్ మారుతోందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అన్నారు. రాష్ట్రంలో జీడిపప్పు, కాఫీ, కోకో, కొబ్బరి ఎక్కువగా పండుతోందని, రైతులకు మద్దతు ధర దక్కేలా చూస్తామన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ పాత్ర కీలకమన్నారు. ఏపీ వ్యవసాయాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందు కోసం కేంద్రం ప్రత్యేక బృందాన్ని నియమించిందని చెప్పారు. కేంద్ర పథకాలు, సాంకేతికత విషయంలో ఏపీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మత్స్యరంగం, పశుపోషణ అభివృద్ధికి సాయం చేస్తున్నట్టు చెప్పారు. సేంద్రియ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ బాగా పనిచేస్తోందన్నారు. సేంద్రియ సాగు విస్తరణకు అన్ని విధాలుగా సాయం చేస్తామని తెలిపారు.
