- చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు అవకాశాలు కల్పిస్తున్నాం
- లక్షమంది మహిళలను వ్యస్థాపకులుగా తీర్చిదిద్దుతా
- ఎటువంటి రెవెన్యూ సమస్యలు రాకుండా పరిష్కరిస్తాం
- ఎంస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. అలాగే చిన్నతరహార పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. స్థానికంగా ఉన్న అవకాశాలు వినియోగించుకుని యువత ముందుకు రావాలన్నారు. ఈ క్రమంలో మహిళలు కూడా అవాకాశాలను అంది పుచ్చుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దు తామన్నారు.
వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారుచేయాలని సూచిం చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో సీఎం పర్యటించారు. ఇందులో భాగంగా ఎంస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండం నాయునపల్లిలో చేనేత పార్కుకూ వర్చు వల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొ చ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నాం.
పెట్టుబ డులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైకాపా పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపో యారని చంద్రబాబు అన్నారు. ఇకపోతే పలు జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
