Tuesday, February 10, 2026
Homeనల్లగొండBhongir MP | సిట్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు

Bhongir MP | సిట్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు

నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల(Naini coal block tenders)పై కేంద్ర మంత్రి(Union Minister) కిషన్ రెడ్డి(Kishan Reddy) ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చారని భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) హయాంలో జరిగిన అవకతవకల కారణంగానే టెండర్లు రద్దయ్యాయని చెప్పినట్లు తెలిపారు. సైట్ విజిటింగ్ ప్రక్రియ సాధారణమేనని కేంద్ర ప్రభుత్వం ముందుగానే చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని, టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని పేర్కొన్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై అసత్య ప్రచారం చేస్తూ కేటీఆర్, హరీష్‌రావు(KTR, Harish Rao) సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు కాబట్టే వారిని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన, 6 గ్యారెంటీల అమలు పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News