బీసీ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈనెల 10,11,12 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా, కార్యక్రమం లో బీసీల 42 శాతం రిజర్వేషన్లు, హక్కులు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి బీసీ సంఘం నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో, విద్యా,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీల బతుకులు మారుతాయి అన్నారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అలాగే తెలంగాణలో 42 శాతం బీసీ బిల్లును ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో చర్చకు తీసుకురావాలని అందుకు కాంగ్రెస్ ఎంపీలు బిల్లుపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ బిల్లును 9త్ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.కొన్ని సంవత్సరాలు గా పోరాడుతున్న బీసీలకు వారి న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు శ్రీమన్నారాయణ,పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మనోజ్ గౌడ్, కరీంనగర్ జిల్లా ఆధ్యక్షురాలు గుంటి స్వరూప,హసీనా, రాజేందర్, బీసీ సంఘము నాయకులు ఉన్నారు.

