అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్స్(Urban Development Ministers) రీజనల్ మీటింగ్(Regional Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదేనని చెప్పారు. వికసిత్ భారత్(Viksit Bharat)కి అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ (PM Modi) పనిచేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరారు. అభివృద్ధి పనులకు అనుమతులను వేగంగా జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతోపాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలని అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలోకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నాం. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
దేశ ఎకానమీలో 10 శాతం తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో డ్రైపోర్టును ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా పోటీ మన దేశంలోని ఇతర రాష్ట్రాల నగరాలతో కాదు.. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం.
