జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ మెజారిటీ(Majority)తో గెలుపొందిన నేపథ్యంలో గ్రామ గ్రామాన సంబరాలు (Celebrations) చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. Brs, బీజేపీ (Bjp) కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా తదితర కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.
