లండన్‌లో భారత సంతతి వ్యక్తి(Indian origin)పై కేసు నమోదైంది(Case book). దలిప్ చద్దా(Dalip Chadha)గా గుర్తించిన నిందితుణ్ని కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఇతను తన భార్యను పొట్టనపెట్టుకున్నారనే కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలిసినవాళ్లు ఎవరైనా తమకు తెలియజేయాలని కోరారు. యూకేలోని ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలో ఉంటున్న 57 ఏళ్ల దలిప్ చద్దా.. ఓ మహిళ ప్రాణాలు తీశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతణ్ని ఘటనా స్థలం వద్ద మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. మృతురాలు వెనెస్సా పుంట్నీ చద్దా(58)ను అతని భార్యగా భావిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం ఖరారు చేయాల్సి ఉంది.
- Advertisement -
