పిల్లల అభివృద్ధి(Child Development)కి సృజనాత్మకత(Creativity), సహ-పాఠ్య కార్యకలాపాలు(Co-curricular Activities) చాలా ముఖ్యమైనవని వక్తలు పేర్కొన్నారు. విజయ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన 35వ వార్షిక కార్టూన్, పెయింటింగ్, వ్యాస రచన పోటీలు, బహుమతి పంపిణీ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లోని CESSలో జరిగింది. ఏడాది పొడవునా నిర్వహించిన ఈ పోటీల్లో 100కు పైగా పాఠశాలలు, కళాశాలల నుంచి 15 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నర్సరీ నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ విభాగాల్లో 300 బహుమతులు, 1500 మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ వీసీ డాక్టర్ భీరప్ప నగరి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ముఖ్య అతిథులు పాల్గొన్నారు. సృజనాత్మకతను పెంపొందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, సమతుల్య అభ్యాసాన్ని ప్రోత్సహించడంలో పాఠ్యేతర కార్యకలాపాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. పిల్లలు డిజిటల్ డివైస్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.
Child Development | పిల్లల అభివృద్ధికి ఇవి చాలా ముఖ్యం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
