Tuesday, October 28, 2025
ePaper
Homeకరీంనగర్Rtc Cargo | కార్గో పార్సిల్ వస్తువుల వేలం

Rtc Cargo | కార్గో పార్సిల్ వస్తువుల వేలం

నవంబర్ 4న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు
గోదావరిఖని డిపో ఆవరణలో వేలం నిర్వహణ
50 శాతం తక్కువ ధరకే ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, స్పేర్‌పార్టులు

గోదావరిఖని(Godavarikhani), పెద్దపల్లి (Peddapalli) పట్టణాల్లో ఆర్టీసీ కార్గో పార్సిల్ (Rtc Cargo Parcel) సర్వీస్ కౌంటర్ల వద్ద డెలివరీ (Delivery) కాకుండా ఉండిపోయిన వినియోగదారుల వస్తువులకు వేలం (Auction) నిర్వహించనున్నట్లు కరీంనగర్ జోన్ లాజిస్టిక్స్ (Logistics) మేనేజర్ వెంకట నారాయణ ప్రకటించారు. నవంబర్ 4న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరిఖని డిపో ఆవరణలో ఈ వేలం జరగనుంది. ఇందులో మొత్తం 60 ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు, ఐరన్ సామాగ్రి, ఇండస్ట్రియల్ స్పేర్‌పార్ట్‌లు, స్టేషనరీ, ఇతర సాధారణ వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులను ఆకర్షించేలా పార్సిల్ అసలు విలువలో 50 శాతం మేరకు తగ్గించి వేలం ప్రారంభించడం జరుగుతుందని లాజిస్టిక్ మేనేజర్ తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు(Industrialists), చిన్న వ్యాపారులు(Business People), ప్రజలు (Public) సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొనడానికి, మరిన్ని వివరాల కోసం ఆసక్తి కలిగినవారు 9154298557, 9949407275, 9154298559, 9154298581 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News