వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్(Mgm Hospital) కేర్ టేకర్ (Care Taker) కేర్‌లెస్‌గా వ్యవహరించాడు. పిల్లల విభాగం(pediatric department)లో ట్రీట్మెంట్ పొందుతున్న పిల్లలను పట్టించుకోలేదు. వాళ్లకు సర్వీసు అందించాలనే బాధ్యత (Duty) మరిచాడు. ఎక్స్‌రే (X-ray) పరీక్షల తర్వాత ఆక్సీజన్ సిలిండర్(Oxygen Cylinder)లతో పిల్లలను వార్డుకు తీసుకెళ్లకుండా మధ్యలోనే వదిలేశాడు. మీరే తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రుల (Parents) పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆ క్రమంలో పేరెంట్స్ తమ పిల్లలను తీసుకెళుతుండగా సిలిండర్ లీక్ అయింది. దీంతో వాళ్లు ఆందోళన చెందారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న మరో కేర్ టేకర్ సాయం చేశాడు. ఈ ఘటనపై ఆసుపత్రి ఆర్ఎంవో (Rmo) స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
