Wednesday, March 11, 2026
Homeరంగారెడ్డిAccident | మున్సిపల్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన కారు… ఇద్దరికి తీవ్ర గాయాలు

Accident | మున్సిపల్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన కారు… ఇద్దరికి తీవ్ర గాయాలు

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి మిలీనియం స్కూల్ వద్ద ఈ ఘటన జరిగింది. మున్సిపల్ సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా రోడ్డు పక్కన పనిచేస్తున్న సమయంలో అంబేద్కర్ నగర్ నుంచి చెన్నాపూర్ వైపు వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపు తప్పి మున్సిపల్ సిబ్బందిపైకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మున్సిపల్ కార్మికులు రవి, ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో వారిని ఈసీఐఎల్ ప్రాంతంలోని రాఘవేంద్ర హాస్పిటల్ కు తరలించి చికిత్స కోసం అడ్మిట్ చేశారు. హాస్పిటల్ వైద్యాధికారులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రదీప్ కు తల భాగంలో తీవ్ర గాయం అయినట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు.

- Advertisement -

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ అధికారి వసంత ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని బాధితుల వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన కారుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News