కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనం
సికింద్రాబాద్, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): మేడారం మహా జాతర(Medaram Mahajatara) సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే(Cantonment MLA) శ్రీగణేష్(Sriganesh) శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma)ను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెలతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. మేడారం మహా జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహా జాతర నేపథ్యంలో మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

