Saturday, February 28, 2026
Homeఆరోగ్యంCancer | 20 లక్షలకు పెరగనున్న క్యాన్సర్ రోగుల సంఖ్య

Cancer | 20 లక్షలకు పెరగనున్న క్యాన్సర్ రోగుల సంఖ్య

మన దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 2040 నాటికి దాదాపు 20 లక్షలకు పెరగనుందని కేంద్ర ప్రభుత్వం(Union Government) పార్లమెంట్‌(Parliament)కు తెలిపింది. ఇవాళ గురువారం రాజ్యసభ(Rajyasabha) ప్రశ్నోత్తరాల సమయం(Question Hour)లో ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి(Minister of State in the Prime Minister’s Office) జితేంద్ర సింగ్(Jitendra Singh) ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాప్తిలో ఇండియా(India) మూడో స్థానంలో ఉందని చెప్పారు. మొదటి రెండు స్థానాల్లో చైనా(China), అమెరికా(America) ఉన్నాయని వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం బయోటెక్నాలజీ విభాగం మొట్టమొదటి HPV వ్యాక్సిన్‌(Vaccine)ను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఈ టీకాను కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మంది జనాభాకు తక్కువ ధరకు లేదా ఉచితంగా అందుబాటులోకి తేవటానికి కృషి చేస్తోందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News