కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా బోయిన్‌పల్లి మండల (Boynpally Mandal) కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. చొప్పదండి శాసన సభ్యుడు (Choppadandi Mla) మేడిపల్లి సత్యం (Medipally Satyam) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ కాలనీలో ఈ రోజు ఇంటింటి ప్రచారం (Door to Door Campaign) చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణా రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపెల్లి సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ వేసిరెడ్డి దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనకయ్య, మాజీ సర్పంచ్ సంబ లక్ష్మీరాజం, మాజీ ఎంపీటీసీ అక్కనపెల్లి ఉపేందర్, వరాల నర్సింగం, కొలుపుల ప్రవీణ్, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
JubileeHills | బోయినపల్లి మండల కాంగ్రెస్ నేతల ప్రచారం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
