Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిStrike | సార్వత్రిక సమ్మెతో సంఘటితంగా పోరాటం చేద్దాం

Strike | సార్వత్రిక సమ్మెతో సంఘటితంగా పోరాటం చేద్దాం

సార్వత్రిక సమ్మెతో సంఘటితంగా పోరాటం చేయాలని, అన్ని వర్గాల సంఘాలు, రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దుర్మార్గపు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి రావాలని ఇప్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి ఒక ప్రకటనలో తెలిపారు. లేబర్ కోడ్లతో కార్మికుల జీవితాలు కార్పొరేట్ కబందహస్తాల్లో నలిగిపోతాయని, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలను ఎండగట్టాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడటం, కనీస వేతనాల పెంపు కోసం పోరాటం అత్యవసరమని చెప్పారు. మనువాద, బ్రాహ్మణీయ, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News