- ఐటిడిఏ కలెక్టర్లకు మొరపెట్టుకున్న కనికరించని అధికారులు.. అవస్థలు పడుతున్న తండావాసులు
గత ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 17/06/2023 తేదీన ఎస్ టి ఎస్ డి ఎఫ్ నిధులతో సుమారుగా 90 లక్షల రూపాయలతో జంగాలపల్లి తండ నుండి అశోక్ నగర్ సైనిక్ స్కూల్ వరకు బిటి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగిందని తండావాసులు వాపోతున్నారు.ఈ రోడ్డును శంకుస్థాపన చేసి కంకర అంతంత మాత్రాన పోసి బిల్లులు తీసుకొని ఈ రోడ్డును నిర్లక్ష్యం చేయడం వలన తండావాసులు యూత్ సభ్యులందరం కలిసి పై అధికారులకు ఫిర్యాదులు చేశామన్నారు.

జిల్లా కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఐటిడిఏ పిఓకి ఏయి కి సంబంధిత అధికారులు అందరికీ సంప్రదించడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు పనులు మొదలుపెట్టడం లేదు. జిల్లా కలెక్టర్ కి మూడుసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం. మేము ఇచ్చే కంప్లైంట్లు, ఫోను రికార్డింగ్ లతో సహా ఏఈ, అధికారులు కాంట్రాక్టర్లకు పంపించడం జరుగుతుంది.
కాంట్రాక్టర్లు ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుత ఉంది. ఇప్పటికైనా ఇట్టి విషయాన్ని పై జిల్లా కలెక్టర్ స్పందించి ఈ కాంట్రాక్టర్లపై అధికారులపై చర్యలు తీసుకొని ఇట్టి రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించి తండవాసులను వాహన దారులు కి న్యాయం చేయలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.
