- బీఎస్పీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాళి తిరుపతి
కరీంనగర్: గత పది సంవత్సరాల క్రితం మంజూరైన బోయినపల్లికి కేటాయించిన గురుకుల పాఠశాలను బోయినపల్లిలోనే కొనసాగించాలని బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు. బోయినపల్లి కి కేటాయించిన గురుకులను గంగాధరకు తరలించే ప్రయత్నం మానుకోవాలని అయన డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా మంజూరైన సంవత్సరం రుక్మాపూర్ లో ఉండడం జరిగింది అదేవిధంగా మల్లి విలాసాగర్ లో నాలుగు సంవత్సరాలు, ఆ తరువాత వేములవాడకు ఈ గురుకుల పాఠశాలను షిఫ్ట్ చేసి దాదాపుగా అక్కడ ఐదు సంవత్సరాలు కావస్తుంది.
ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒక పది రోజుల్లోపు మళ్ళీ గంగాధరకు షిఫ్ట్ చేస్తామని చూడడం సరియింది కాదన్నారు.బోయినపల్లి లో గురుకుల పాఠశాలను నడపడానికి వసతులు ఉన్నప్పటికీ. ఉపాధ్యాయుల సౌకర్యం కోసం ఇలాచేయడం పద్ధతి కాదన్నారుమండల అధివృద్దిని కుంటూ పరచాలని అనుకోవడం సక్రమం కాదన్నారు. ఎం ఎల్ ఏ సత్యం ఈ విషయం లో ఆలోచన చేయాలని తిరుపతి సూచించారు.
