Monday, March 2, 2026
Homeరంగారెడ్డిHILT | పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా

HILT | పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా

HILT పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట(BRS Porubata) పట్టింది. మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే(Medchal MLA) మల్లారెడ్డి (Mallareddy), జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం (Congress Party Government) 5 లక్షల కోట్ల విలువైన కుంభకోణానికి (Scam) పాల్పడిందని నేతలు ఆరోపించారు. ఆ స్కామ్ పేరు.. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(HILT) పాలసీ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఇంకా ఏమన్నారంటే..

  • దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకంభకోణానికి కాంగ్రెస్ సర్కారు తెరలేపింది.
  • హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో భారీ కుంభకోణానికి తెర లేపారు.
  • సాధారణంగా ప్రభుత్వాలు ఉపాధి కోసం, పరిశ్రమల కోసం అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా లేదా రాయితీలు ఇచ్చి కంపెనీలకు భూకేటాయింపులు చేస్తాయి
  • రాష్ట్రానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది, ప్రభుతానికి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ భూములను అందిస్తారు..
  • ఈ విధంగా భూములు పొందినవారు పరిశ్రమలు నడిపించి ప్రభుత్వం చెప్పిన ఉద్దేశాలను నెరవేర్చాలి.
  • అలా హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడల్లో దశాబ్దాల కిందట 9292 ఎకరాల భూముల్ని పరిశ్రమల ఏర్పాటుకోసం కేటాయించారు. – అందులో అనేక ఏళ్లపాటు పరిశ్రమలు కొనసాగాయి.
  • హైదరాబాద్ విస్తరించడంతో ఆ పరిశ్రమలను దాటి జనావాసాలు ఏర్పడ్డాయి. అందులో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.
  • అందులో చాలా మంది యజమానులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం దగ్గరికి వచ్చారు.
  • అతి తక్కువ రేటుకి ఆ భూములను రెగ్యులరైజ్ చేయాలని ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదు.
  • అప్పుడు పరిశ్రమలకు కేటాయించిన అతి తక్కువ ధరల భూమి విలువ ఇప్పుడు ఎన్నో రేట్లు పెరిగింది
  • ప్రజారోగ్యం దృష్ట్యా కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తీసుకువెళ్లాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
  • అయితే భూమి వినియోగ మార్పిడి నేపథ్యంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ రేట్లకి కనీసం 100% అధికంగా 200 శాతం చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాం.
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసిన ఈ నిబంధనలను పక్కనపెట్టి అతి తక్కువ ధరలకు రెగ్యులరైజ్ చేస్తామంటూ ఈ భారీ స్కాంకు తెర తీశారు.
  • ఈ భూముల్లో ఒక్కో ఎకరం విలువ కనీసం 40 నుంచి 50 కోట్ల రూపాయలకి తక్కువ కాకుండా ఉంటుంది. లెక్క కడితే.. దాదాపు ఐదు లక్షల కోట్ల విలువైన భూములు ఇవి.
  • వీటిని రెగ్యులరైజ్ చేసేందుకు మొన్నటి కేబినెట్ సమావేశంలో రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30 శాతం చెల్లిస్తే రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
  • అయితే ఈ భూములు అన్నింటిపైన సీఎం అనుచరులు, సోదరులు, ప్రభుత్వ పెద్దల అనుయాయులు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారనే అనుమానాలున్నాయి.
  • ఇంతకు ముందు కూడా మూసి బ్యూటిఫికేషన్ పేరుతో ఆ చుట్టుపక్కల భూములపై కన్నేశారు.
  • ఆ తర్వాత మెట్రో రైల్ భూములపైన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కబళించాలని చూశారు.
  • ఇప్పుడు తాజాగా 9292 ఎకరాల పారిశ్రామిక భూముల పైన కన్నేశారు.
  • కేవలం వారం రోజుల్లో దరఖాస్తులు, మరో వారం రోజుల్లో స్క్రూటినీ, కేవలం 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారు.
  • హైదరాబాద్ నగరంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వ ఆసుపత్రులకు, పార్కులు, పిల్లల ఆట స్థలాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి స్థలాలు లేవు, చివరికి స్మశానానికి కూడా భూమి అందుబాటులో లేదు.
  • అలాంటిది ప్రజల ఆస్తిగా ఉన్న పారిశ్రామిక భూములను ఇప్పుడు రెగ్యులరైజేషన్ పేరుతో అనుయాయులకు అప్పనంగా కట్టబెడతం అంటున్నారు
  • కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూములను ప్రభుత్వం తీసుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగించాలి.
  • లేదా ఆ భూములను వెనక్కి తీసుకుని వేలం ద్వారా బహిరంగ మార్కెట్ లో అమ్మాలి.
  • కానీ.. ఇవేవీ చేయకుండా ఐదు లక్షల కోట్ల రూపాయల స్కాం చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.
  • ఈ భూములను ఎవరైనా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకున్నా వారు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. BRS ఆ భూములను వెనక్కి తీసుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తుంది.
  • ఈ భూకుంభకోణంపై ఓవైపు న్యాయపోరాటం చేస్తాం. మరోవైపు ఢిల్లీ వరకూ వెళ్లి కాంగ్రెస్ అవినీతిని జాతీయ స్థాయిలో ఎండగడతాం.
  • వెంటనే ప్రభుత్వం HILT పాలసీని రద్దుచేసి ప్రభుత్వ భూములను తెగనమ్మే పన్నాగాలకు తెర దించాలి.
  • ఇలాంటి పరిశ్రమల భూములను ఇతర రాష్ట్రాల్లో 50% భూమిని వెనక్కి తీసుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
  • ఈ సర్కారు కనీసం ఆ విధానాన్ని కూడా పాటించడం లేదు.
  • ఒకప్పుడు మనం టీఎస్ఐపాస్‌ని పరిశ్రమలను ఆహ్వానించడానికి తీసుకువస్తే అదే టిఎస్ఐపాస్‌ను ఇప్పుడు పరిశ్రమల భూములు అమ్మడానికి కాంగ్రెస్ వాడుకోవడం దుర్మార్గం.
- Advertisement -
RELATED ARTICLES

Latest News