Saturday, March 7, 2026
Homeవరంగల్‌Sarees | 18 సం,, నిండిన ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలి…

Sarees | 18 సం,, నిండిన ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలి…

  • బిఆర్ఎస్ రూరల్ మండల కమిటీ డిమాండ్.

నర్సంపేట రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం మండల పార్టి కార్యలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల ఇన్చార్జి నామాల సత్యనారాయణ, మండల కన్వీనర్ కొమళ్ళ గోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా 18 సంవత్సరం లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇచ్చారని తెలిపారు.కానీ ఇప్పుడు కేవలం మహిళ సంఘాలలో ఉన్న సభ్యులకు మాత్రమె ఇస్తామని చెప్పి చాల మంది మహిళలకు చీరలు ఇవ్వకుండా మాసం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.ప్రభుత్వం వెంఠనే ఎలాంటి అంక్షలు లేకుండా ప్రతీ ఒక్క మహిళకు చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఈర్ల నర్సింహరములు,మోతే పద్మనాభ రెడ్డి,బండారి రమేష్,మోటురీ రవి,కోడారీ రవి,భూక్య వీరన్న,అల్లి రవి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,జాటోతు బిమ్ల నాయక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News