Thursday, March 26, 2026
HomeతెలంగాణBRS | తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల సమీక్షా సమావేశం..

BRS | తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల సమీక్షా సమావేశం..

  • సమావేశానికి హాజరైన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి…

బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఇంచార్జీలతో సమీక్షా సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జరగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రులు హరీష్ రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు, స్థానిక ఇంచార్జీలు పార్టీ నాయకులు హాజరయ్యారు.

సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యాకర్తల చైతన్యం, ప్రజలతో అనుసంధానం, రాబోయే రాజకీయ కార్యక్రమాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్తకు బలం చేకూర్చే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నాయకులు సూచించారు.ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు ధైర్యం, దిశానిర్దేశం చేసి పార్టీ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News